NDL: నందికొట్కూరులో చాక్లెట్లు తిని 11 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఆస్వస్థతకు గురయ్యారు. బడిలో పంచాలని 7వ తరగతి విద్యార్థినికి ఓ అగంతకుడు చాక్లెట్లు ఇచ్చాడు. ఆ చిన్నారి PET సహా పలువురికి పంచగా.. తిన్నవారి కనురెప్పలు నల్లగా మారడం, కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై ఇవాళ పోలీసులు రంగంలోకి దిగారు.