KNR: శంకరపట్నం మండలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టివ్ నేషనల్ మెడికల్ మిషన్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.