కృష్ణా: కూరాడ గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు కళ్యాణపు నవాబ్ బుధవారం రైతులకు మినుములు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.