NLR: రాపూర్ మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ స్వామి వారికి అభిషేకం, చందనాలంకారము, శాంతి హోమం, శ్రీ వార్లకు కళ్యాణోత్సవం, సాయంత్రం బంగారు గరుడ వాహన సేవ ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణలతో అంగరంగ వైభవంగా జరిగింది.