KRNL: రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి సీఐ మంజునాథ్, ఎస్సై రమేష్ రెడ్డికి సూచించారు. శనివారం కోసిగి పోలీస్ స్టేషన్ను ఆమె తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. శాంతిభద్రతలు,పెండింగ్ కేసులు, రౌడీషీటర్ల వివరాలు సమీక్షించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.