ASR: చింతపల్లి మండలం చౌడుపల్లి సచివాలయం-2లో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కే. అరుణ కుమారి సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో మండలంలోని తోటి ఉద్యోగులు అందరూ ముందుకు వచ్చి రూ. 34వేలను సమకూర్చారు. ఆ సొమ్మును శనివారం మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ యూనియన్ అధ్యక్షుడు శోభన్, కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు.