KRNL: ఆదోని పట్టణంలో బంగారు వ్యాపారుల మోసాలపై బాధితులు ఎమ్మెల్యే డా. పార్థసారధిని కలిసి ఇవాళ ఫిర్యాదు చేశారు. కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన దేవేంద్రప్ప బంగారం తాకట్టు వ్యవహారంలో మోసపోయినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ పూర్తి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.