సత్యసాయి: విదేశాల్లో చదువుకోవాలనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కల నెరవేరుస్తూ, విదేశీ విద్యా పథకానికి త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జగన్ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో కేవలం 60 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్య చదువుకునే అవకాశం కల్పించారన్నారు. నూతన విధానంలో విదేశీ విద్యా పథకానికి పునరుద్ధరించడానికి సీఎం చర్యలు చేపట్టారని తెలిపారు.