BDK: పాల్వంచ మండలంలోని జగన్నాధపురం రంగాపురం పంచాయతీలలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ వనమా వెంకటేశ్వరరావు ఇవాళ విస్తృత పర్యటన చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేశానని, నేను చేసిన పనులే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి తోడ్పడతాయని తెలిపారు.