W.G: ఉండ్రాజవరం ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ దీర్ఘకాల సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడింది. అనేక ప్రయత్నాలు, కాంట్రాక్టర్లతో సమావేశాలు, అధికారులతో నిరంతర చర్చల ఫలితంగా సర్వీస్ రోడ్ పనులు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యను ప్రస్తావిస్తూ చేసిన కృషి ఫలితంగా కొత్త కాంట్రాక్టర్ను ప్రభుత్వం నియమించడంతో పనులు ప్రారంభమయ్యాయి.