KDP: మేయర్‌గా ఎన్నికైన మరుసటిరోజు పాకా సురేశ్‌కు షాక్ తగిలింది. ఇంటి పన్ను చెల్లించలేదంటూ కోటిరెడ్డి సర్కిల్లోని స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద భారీ కటౌట్ వెలిసింది. YCP రంగుతో ఏర్పడిన కటౌట్‌ను కొద్దిసేపటికి నగరపాలక అధికారులు తొలగించారు. ఈ ఫ్లెక్సీలో ఎవర్రా నన్ను ఆపేది.. ఇదేమి కర్మ మన కడపకు నవ్విపోదురు గాక, నాకేటి సిగ్గు అంటూ ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు.