CTR: పుంగనూరు మండలం అడవినాథనికుంట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ‘భూసార పరీక్షలపై’ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. జిల్లా వనరుల కేంద్రం నుంచి DRC AO మాధవి హాజరయ్యారు. మొక్కలు, పంటలకు ప్రధాన మూలకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ మూలకాలు అని చెప్పారు. వాటి లభ్యత గురించి వివరించారు. మట్టి నమూనాలను సేకరించే పద్ధతిపై అవగాహన కల్పించారు.