ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుత్తి పామిడి మండల ఇంఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈశ్వరును స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.