ELR: ఎఐటీయుసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని అన్నారు. గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.