ADB: ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్త తొడసం లక్ష్మీబాయి కోడలు తొడసం మహేశ్వరి మధ్య జరిగిన రసవత్తర పోరులో కోడలుపై అత్త విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన తొడసం లక్ష్మీబాయి తన కోడలు తొడసం మహేశ్వరిపై 140 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితాల్లో గ్రామ రాజకీయ ఆసక్తిని రేకెత్తించాయి.