RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఉప్పరగడ్డ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించిన చందునాయక్‌ను పలువురు ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి పట్ల చందు నాయక్ చూపిస్తున్న కృషి, ప్రజలపై ఆయనకు ఉన్న అనుబంధం ఈ విజయానికి కారణమన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా మరింత సేవ చేయాలన్నారు.