NTR: గతం ప్రభుత్వంలో దుర్గ గుడి పాలకమండలి ఛైర్మన్గా పనిచేసిన కర్నాటి రాంబాబుతో సహా విజయవాడకు చెందిన మరో ఇద్దరు వైసీపీ నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. విజయవాడకి చెందిన కర్నాటి రాంబాబుకు రాష్ట్ర స్థాయి పదవి రావడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తనకు పదవి రావడానికి సహకరించినందుకు పార్టీ అధి నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.