మహబూబ్ నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగి ప్రజలను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్లో 9.4°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°Cగా రికార్డు అయ్యాయి. చలి కారణంగా వృద్ధులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.