కృష్ణా: సూర్యారావుపేటకు చెందిన 22ఏళ్ల లోహిత కంకిపాడులోని పిన్ని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం క్రితం ప్రేమించిన యువకుడు చనిపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైందని బంధువులు తెలిపారు. ఈరోజు ఉదయం ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.