VZM: బాడంగి మండలం గజరాయుని వలస గ్రామానికి చెందిన నల్ల ఈశ్వర రావు గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం ఈశ్వరరావు ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.