అన్నమయ్య: రాయచోటిలో అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఈ ఏడాది ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా శాంతియుతంగా ముగిసింది. సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించినందుకు గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్‌ను మతపెద్దలు, ముస్లిం సోదరులు, అయ్యప్ప భక్తులు, పీస్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజల సహకారంతో శాంతియుతంగా ఉత్సవం జరగడం ఆనందదాయకమని ఎస్పీ తెలిపారు.