GNTR: మంగళగిరిలోని పలు హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెస్టారెంట్ సహా పలు హోటళ్లపై 7 కేసులను నమోదు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 33 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డీటీ వెంకట్రావు, సీఎస్డీటీ శ్రీనివాసరావు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.