KNR: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి పట్ల రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.