మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌకూర్ ప్రాంతంలో STF డీ టీం సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి సిబ్బందితో కలిసి రైడ్స్ చేశారు. 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కౌకూర్‌లోని శ్యామల కన్వెన్షన్ వేంకటేశ్వరనగర్ సమీపంలో అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి డిఫెన్స్ బాటిల్స్ అమ్మకాలు జరుపుతున్న సమయంలో దాడి చేసి మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.