రోజూ 4-5 కరివేపాకులను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మలేషియాలో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, రొమ్ము క్యాన్సర్ వ్యాప్తిని నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.