NZB: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ IFTU నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని మోడ్రన్ బీడీ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి. సూర్య శివాజీ మాట్లాడుతూ.. కంపెనీ యజమాన్యం కార్మికుల అమాయకత్వాన్ని నిరాక్షరాస్యతను ఆసరా చేసుకుని కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందన్నారు.