ఆదోని పట్టణం సిరుగుప్ప రోడ్డులోని NDBL పత్తి జిన్నింగ్ & ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఎమ్మెల్యే పార్థసారథి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఘటనపై ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీ నష్టం వివరాలు తెలుసుకుని బాధితులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.