AP: అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సరిగా చదవట్లేదని తల్లిదండ్రులకు వార్డెన్ ఫిర్యాదు చేయడంతో హెయిర్‌డై రసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. విద్యార్థినులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.