NZB: జిల్లాలోని బోధన్ డివిజన్లో గురువారం జరుగుతున్న మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హల్లో ఏర్పాటు చేసిన CC కెమెరాల ద్వారా ఆయన పరిశీలన జరిపారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.