NTR: టీడీపీ MLAల పనితీరుపై ఆ పార్టీ అధిష్టానం IVRS సర్వే చేపట్టింది. గురువారం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 8645417572 అనే నెంబర్ నుంచి సర్వే జరిగింది. ఎమ్మెల్యే పనితీరు బాగుంటే 1, లేకుంటే 2, చెప్పడం ఇష్టం లేకపోతే 3 నొక్కాలని సర్వేలో కోరారు. ఎమ్మెల్యేలుగా గెలిచి 18 నెలలు అయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహించారు.