HYD: జీహెచ్ఎంసీ ప్రస్తుత, మాజీ కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, కె. ఇలంబర్తిలకు హైకోర్టు నోటీసులిచ్చింది. శేరిలింగంపల్లి సిటీప్లానర్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల రికార్డులను సమాచార హక్కు చట్టం కింద పరిశీలనకు అనుమతించకపోవడంతో వారికి కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. జనవరి 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.