కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్స్ చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నారు. మరో మైనర్ జూవెనలుకు పంపించారు. 10 లక్షల విలువైన 18 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు నమోదైన బైక్ దొంగతన కేసులు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలియజేశారు.