WNP:పెబ్బేరు మండలం చిన్న గుమ్మడంలో కావలి మద్దిలేటికి చెందిన బైక్ను ఇవాళ గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. దుండగులు బాధితుడి కుటుంబ సభ్యులు బయటికి రాకుండా ఇంటి ప్రధాన ద్వారానికి గొళ్లెం వేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.