SKLM: పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తిచేస్తామని తెలిపారు.