SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, గాదరి కిషోర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు అరాచకం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కోలేక దాడులకు దిగడం కాంగ్రెస్ దిగజారుడు పాలనకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు.