ELR: జీలుగుమిల్లి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుట్టాయగూడెం మండలానికి చెందిన బాలిక ప్రవర్తనపై అనుమానంతో సిబ్బంది వైద్య పరీక్షలు చేయించగా విషయం నిర్ధారణ అయ్యింది. బాలిక బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా ప్రస్తుతం బాలిక ఐసీడీఎస్, వైద్యుల పర్యవేక్షణలో ఉంది.