MDK: తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామపంచాయతీ 2018లో ఏర్పడగా రెండో పర్యాయం ఎన్నికలు జరుగుతున్నాయి. 486 ఓటర్లున్న దాతర్ పల్లి గ్రామ పంచాయతీని బీసీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. సర్పంచ్ పదవికి చతుర్ముఖ పోటీ ఉండగా కొయ్యల శ్రీనివాస్ గౌడ్, చింతల జయరాములు, తీగుళ్ల మల్లేశం, పిట్ల సాయి బాబా పోటీ చేస్తున్నారు. 8 వార్డుల్లో 22 మంది వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు.