గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఉన్న 13 భద్రతా బగ్‌లను గూగుల్ తాజాగా పరిష్కరించింది. వీటిల్లో ఒకదాన్ని ముంబైకి చెందిన ఇంజినీర్ శ్రేయస్ గుర్తించారు. దీనిని ఉపయోగించి హ్యాకర్లు యూజర్ల సున్నితమైన సమాచారాన్ని దోచుకునే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు.