భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమకు బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్ దక్కినట్లు అమెరికా ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన ధాన్యాలు, సోయా విషయంలో మంచి ఆఫర్లు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం ఢిల్లీలో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అమెరికన్ వస్తువులకు భారత్ మంచి ప్రత్యామ్నాయ మార్కెట్ అని గ్రీర్ పేర్కొన్నారు.