E.G: కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బొండు రత్నంకి మంజూరైన రూ.36,300 విలువ గల CMRF చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా బుధవారం అందజేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.