GDWL: గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1,50,672 మంది ఓటర్ల డేటాను పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 974 కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాల పరిధిలోకి వస్తాయని వివరించారు.