»Russia Ukraine Crisis Red Alert Issue All Over Nation Missiles Attack
Russia-Ukraine Crisis: ఎయిర్ రెడ్ అలర్ట్ ప్రకటించిన ఉక్రెయిన్.. ఏ క్షణంలోనైనా క్షిపణి దాడులు జరగొచ్చు
ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశంలో ఎక్కడైనా క్షిపణుల(missiles)ను వదలగలదని ఉక్రెయిన్ ప్రకటించింది.
Russia-Ukraine Crisis: ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశంలో ఎక్కడైనా క్షిపణుల(missiles)ను వదలగలదని ఉక్రెయిన్ ప్రకటించింది. నిజానికి, గురువారం రాత్రి, రష్యా మళ్లీ ఉక్రెయిన్పై పెద్ద దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, 10 మంది గాయపడినట్లు సమాచారం.
మృతి చెందిన వారిలో ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం ప్రకారం.. ఈ దాడి చాలా ఘోరమైనది, ఇది అపార్ట్మెంట్(Apartment), మెడికల్ క్లినిక్(mediacal clinic), వాటర్ పైప్లైన్(water pipeline)కు చాలా నష్టం కలిగించింది. దీంతో పాటు మరికొన్ని ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రష్యా దాడుల హెచ్చరిక జారీ చేయబడింది. దేశంలో ఎక్కడైనా దాడి చేయవచ్చని చెబుతున్నారు.
మే ప్రారంభం నుండి 20 క్షిపణి, డ్రోన్ దాడులు
ఈ దాడికి రష్యా ఇస్కాండర్ క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించినట్లు సమాచారం. ఉక్రెయిన్ ఈ దాడిలో, ఉక్రెయిన్ సైన్యం ఆకాశంలో 10 రష్యన్ క్షిపణులను ధ్వంసం చేసింది. మే ప్రారంభం నుండి, రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్పై 20 క్షిపణి, డ్రోన్ దాడులను నిర్వహించింది.
కదులుతున్న కారు ముందు మిస్సైల్
కీవ్ నగర మేయర్.. నగరంలో పేలుళ్లు జరుగుతున్నాయని చెప్పారు. వాయు రక్షణ పనిలో సైన్యం ఉందన్నారు. అంతకుముందే ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించిన వీడియో కూడా బహిర్గతమైంది. ఇందులో ట్రాఫిక్ మధ్యలో కదులుతున్న కారు ముందు క్షిపణి ఎలా పడిపోయిందో చూడవచ్చు. దీంతో ప్రజల్లో కలకలం రేగింది. ఈ దాడిలో కారులో కూర్చున్న వారు తృటిలో సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. మే 29న జరిగిన ఈ ఉదంతం తెలిసిందే. సమాచారం ప్రకారం, రష్యా సైన్యం 11 బాలిస్టిక్ , క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుని అన్ని క్షిపణులను ధ్వంసం చేసింది.
VIDEO: missile fragment falling on a #Kyiv street during the May 29 RU missile strike, missing two cars by just 10 cm. Another angle of the vid I tweeted earlier.
Location is Pochayna in northern Kyiv, one of the busiest intersections in the city (and YES, there’s a McDonald’s). pic.twitter.com/iiJFzo4Sjz