SRCL: వేములవాడ అర్బన్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. కేంద్రంలో కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి ఇంఛార్జ్ కలెక్టర్ తెలుసుకున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.