PDPL: ధర్మారం(M) మల్లాపూర్ TGSW బాలికల పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్న మొగిలి మధుకర్ కొడుకు మోక్షిత్(4) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వంటగదిలోని వేడి సాంబార్ గిన్నెలో పడ్డాడు. ఇది గమనించిన తండ్రి వెంటనే బాలుడిని KNR ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ MGM తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ఇవాళ మృతి చెందాడు.