ADB: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.