కడప: వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టుకు సంబంధించిన టైలింగ్ ఫాండ్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారధి రెడ్డి ఆరోపించారు. సోమవారం టైలింగ్ పాండ్ వద్ద ఆందోళన చేస్తున్న కేకే కొట్టాల గ్రామస్తులను ఆయన కలిశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.