NLG: కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్లావత్ తండాకు చెందిన 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్తోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.