NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నం సమీపంలోని వెంకటరెడ్డి కాలనీ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొని కిరణ్ అనే 6వ తరగతి చదివే విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక టీడీపీ నాయకులను సంఘటనా స్థలానికి పంపించారు.