CTR: కుప్పం RTC బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో దొరికిన సుమారు 60 ఏళ్ల వృద్ధురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌తో ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఇంకా మాట్లాడలేదని వైద్యులు తెలిపారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో, ఆచూకీ తెలిసినవారు కుప్పం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అర్బన్ సీఐ శంకరయ్య విజ్ఞప్తి చేశారు.