విశాఖ గాజువాక ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం అధ్వర్యంలో ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించాలని, లేని పక్షంలో భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవనభృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు రూ. 25 వేలు ప్రతి ఆర్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకి ఇవ్వాలన్నారు.